Akhanda : బాలయ్య మాస్ కం బ్యాక్ “అఖండ” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Akhanda : నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబోలో వచ్చిన ఈ భారీ చిత్రం గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యి విజయ దుంధిబి మ్రోగించింది.

అయితే అనేక అంచనాలు నడుమ విడుదల అయ్యి అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బాలయ్యకి మాస్ కం బ్యాక్ గా అలాగే అధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్స్ లో సూపర్ గా రన్ అవుతుండగా ఎట్టకేలకు ఓటిటి రిలీజ్ పై ఒక అధికారిక క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి వారు ఈ సినిమాని ఇదే జనవరి నెల 21 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో తీసుకురానున్నట్టు కన్ఫర్మ్ చేసారు.

ఈ సినిమా కోసం థియేటర్స్ లో ఎలా అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూసారో అదే విధంగా ఓటిటి రిలీజ్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ కూడా అఖండ భారీ వ్యూవర్ షిప్స్ తో ఏమన్నా రికార్డు నెలకొల్పుతుందో చూడాలి.