స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) ని పాన్ ఇండియన్ లెవెల్లో ఒక ఐకాన్ స్టార్ గా నిలబెట్టే సినిమాలా “పుష్ప” ఉంటుంది అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. దీనితో ఈ హ్యాట్రిక్ కాంబో నుంచి వస్తున్న ఈ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే భారీ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ఈ ఏడాదిలోనే డిసెంబర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు.
మరి డేట్ ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవ్వనుంది అని కన్ఫర్మ్ చేసాయి. దానిని నిజం చేస్తూ చిత్ర యూనిట్ ఇప్పుడు అధికారికంగా ప్రకటన ఇచ్చేసారు. డిసెంబర్ 17 నే థియేటర్స్ లో బన్నీ బిగ్ ప్రాజెక్ట్ అడుగుపెట్టనున్నట్టు తెలిపారు.
అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చెయ్యగా మొదటి భాగం ఇప్పుడుకి ఫిక్స్ అయ్యింది. అప్పుడు పలు బాలీవుడ్ సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి. మరి వాటిని దాటి హిందీలో బన్నీ ఎలా పెర్ఫామెన్స్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.