Reena Dwivedi : ఎవరీ రీనా ద్వివేది.? ఎందుకంత పాపులారిటీ.!

 Reena Dwivedi : ఆమె ఓ ఎన్నికల అధికారిణి.. అయితే, ఏంటట.! ఆమె పేరు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. కారణం, ఆమె కేవలం ఎన్నికల అధికారిణి మాత్రమే కాదు, అంతకు మించి. ఆమె డ్రెస్సింగ్ కారణంగానే ఆమెకు ఇంత స్థాయి పాపులారిటీ లభిస్తోంది.

గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఓటర్లు, సాటి అధికారులే కాదు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతగా వచ్చిన సాయుధులైనవారూ పోటీపడ్డారు. అలా రీనా ద్వివేదీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, జరుగుతూనే వుంది.

తాజాగా మరోమారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మీడియా, ఆమెను వెంటాడింది. ‘నేనూ సాధారణ మహిళనే. నాకెందుకు ఇంత పాపులారిటీ వచ్చిందో అర్థం కావడంలేదు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటు వేయండి..’ అని తాజాగా సెలవిచ్చింది రీనా ద్వివేది.

స్టైల్ సీక్రెట్ ఏంటి.. తానేమీ ప్రత్యేకంగా స్టైలింగ్ చేసుకోవడంలేదనీ, తానూ సాధారణ మహిళననీ, తనకంటే చాలామంది అందగత్తెలు దేశంలో వున్నారనీ రీనా ద్వివేది చెప్పడం గమనార్హం.

ఇదిలా వుంటే, రీనా ద్వివేదికి పెరుగుతున్న పాపులారిటీ నేపథ్యంలో ఆమెను రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయట ఉత్తర ప్రదేశ్‌లోని ప్రదాన రాజకీయ పార్టీలు. ఈ విషయమై రీనా ద్వివేదీని ప్రశ్నిస్తే, లైట్ తీసుకుంది.

బాధ్యతగల ఉద్యోగిణిగా తన పని తాను చేస్తున్నానని, పాపులారిటీ అనుకోకుండా వచ్చిందనీ, దాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవడంలేదని అంటోందిట రీనా ద్వివేది.