ప్రపంచ వ్యాప్తంగా “RRR” ఎన్ని థియేటర్స్ రిలీజో తెలిస్తే మైండ్ బ్లాక్.!


ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇద్దరు మాస్ హీరోలతో మాస్ దర్శకుడు రాజమౌళి తీసిన బిగ్గెస్ట్ ఇండియన్ యాక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. తారా స్థాయి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారో తెలుస్తుంది. ఈ సినిమాని ఏకంగా 10 వేలకు పై చిలుకు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. పది వేల థియేటర్స్ లో అంటే ఈ సినిమాపై ఏ లెవెల్ అంచనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది. ప్రతీ చోట కూడా ఈ చిత్రం రికార్డు లెవెల్లో రిలీజ్ అవుతుందట. మరి ఈ విజువల్ వండర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే జనవరి 7 వరకు ఆగక తప్పదు.