యూఎస్ లో విజయ్ సినిమాకి రికార్డు మార్క్ బిజినెస్.!

సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వారసుడు” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా అభిమానులు ఎంతో కాలం నుంచి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా ఈ సినిమాని అయితే తెలుగు సహా తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాపై రెండు భాషల్లో కూడా మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి అయ్యితే ఈరోజే టి సిరీస్ ఆడియో హక్కులు కొనుగోలు చేసినట్టు అప్డేట్ అందించగా ఇప్పుడు ఈ సినిమా యూఎస్ బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఇప్పుడు తెలుస్తుంది.

ఈ చిత్రానికి యూఎస్ మార్కెట్ లో అయితే విజయ్ కెరీర్ లో ఏ సినిమాకి పలకని రికార్డు ధర పలికినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాకి ఎంత అఫర్ వచ్చింది అంటే ఓన్లీ తమిళ్ వరకు మాత్రమే 7.5 కోట్ల డీల్ సెట్టయ్యిందట.

దీనితో విజయ్ కెరీర్ లోనే ఈ డీల్ అత్యధికం అని సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి అయితే సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నాడు.