Pithapuram: నిన్న పవన్ పై తిరుగుబాటు… నేడు మరో సంచలనం రేపిన వర్మ…. అసలేం జరుగుతోంది?

Pithapuram: పిఠాపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగిన 2019 ఎన్నికలలో కూడా పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ జగన్ ప్రభంజనంలో ఈయన కూడా కొట్టుకుపోయారు. ఇక ఈ ఐదేళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ తిరిగి నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు.

2024 ఎన్నికలలో తనకు టికెట్ ఇస్తే కనుక కచ్చితంగా గెలుపొందుతాను అనే ధీమా కూడా వ్యక్తం చేశారు అయితే చివరి నిమిషంలో మాత్రం వర్మ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో తప్పనిసరి పరిస్థితులలో వర్మ తప్పుకోవలసి వచ్చింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా పంపిస్తానని మాయమాటలు చెప్పడంతో పవన్ గెలుపు కోసం వర్మ కూడా ఎంతో కష్టపడ్డారు.

ఇలా పవన్ ప్రచారాలలో పాల్గొనక పోయిన అన్ని తానే వర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ పవన్ విజయానికి కారణమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మ ఆశపడినట్టు ఆయనకు ఎలాంటి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అదేవిధంగా జనసేన నాయకులు కూడా తనని దూరం పెడుతున్న నేపథ్యంలో ఆయనకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది.

ఇలాంటి తరుణంలోనే వర్మ ఇటీవల సోషల్ మీడియా వేదికగా కష్టపడి గెలిచిన గెలుపుకే గౌరవం అంటూ పవన్ గెలుపు కోసం ఈయన కష్టపడుతూ ప్రచారం చేసిన వీడియోని షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జనసైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్మను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇలా జనసైనికులు ఒక్కసారిగా ఆగ్రహించడంతో వర్మ ఆ పోస్టును డిలీట్ చేశారు.

ఈ ట్వీట్ తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తే హైదరాబాద్ టీమ్ నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వర్మ తీవ్ర అసహనంతో ఉన్నారని.. అనుచరుల వద్ద బాహటంగానే తన ఆవేదన బయట పెడుతున్న వర్మ ఇలా తన మనసులో మాటను ఒక ట్వీట్ రూపంలో బయటపెట్టి డిలీట్ చేయడంతో వర్మ వ్యవహార శైలి పై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.