సమంత సిద్ధార్థ్ విడిపోవడం వెనుక రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో సమంత తన రేంజ్ మారిపోతుందని భావిస్తున్నారు. సమంత నాగచైతన్య చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లైన నాలుగేళ్ల తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. సమంత చైతన్య ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు జవాబు తెలియక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఎంతో అన్యోన్యంగా ఉన్న చైతన్య సమంతల మధ్య కొన్ని నెలల్లోనే ఏం జరిగిందో ఫ్యాన్స్ కు అస్సలు అర్థం కావడం లేదు. అయితే నాగచైతన్యకు ముందు సమంత సిద్ధార్థ్ ను ప్రేమించిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ అనే సినిమాలో సిద్దార్థ్, సమంత కలిసి నటించారు. శ్రీకాళహస్తిలో సిద్దార్థ్, సమంత కలిసి పూజలు చేశారని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే సిద్దార్థ్ సమంత విడిపోవడానికి చాలామందికి కారణం తెలియదు.

ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్లే సమంత సిద్ధార్థ్ విడిపోయారని సమాచారం. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ సిద్దార్థ్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. మోసం చేసేవారు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు అంటూ అప్పట్లో సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనం అయింది. స్కూల్ టీచర్ నుంచి తాను నేర్చుకున్న ఫస్ట్ లెసన్ ఇదేనని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.

సిద్దార్థ్ చేసిన ట్వీట్ల గురించి అప్పట్లో చర్చ జరిగింది. సమంతనే తనను మోసం చేసిందని అప్పట్లో సిద్ధార్థ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. మరోవైపు సమంత ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉంటున్నారు. విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో సమంత మీడియాకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం సమంత యాక్టివ్ గా ఉంటున్నారు.