మహేష్ బాబు నటించిన నిజం ఫ్లాప్ కావడానికి అసలు కారణమేంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో యావరేజ్ సినిమాల కంటే అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మహేష్ బాబు సినీ కెరీర్ లోని సినిమాలలో ఒకటైన నిజం సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏకంగా 21 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూస్తే మూడు రేట్ల బిజినెస్ చేయడం గమనార్హం. ఒక్కడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబుతో తేజ బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించాడని అందరూ భావించగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. గోపీచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేదు.

ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన నిజం మౌత్ టాక్ నెగిటివ్ గా రావడం గమనార్హం. హీరో పాత్రను దర్శకుడు తేజ వీక్ గా క్రియేట్ చేయడంతో మహేష్ బాబు అభిమానులలో చాలామందికి ఈ సినిమా నచ్చలేదు. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఒక విధంగా మైనస్ అయింది. రాశీ విలన్ ప్రేయసిగా నటించగా ఆమె పాత్ర కూడా సినిమాకు ప్లస్ కాలేదు.

మహేష్ బాబు అభిమానులకు ఈ సినిమా నచ్చినా సాధారణ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాలోని అన్ని పాటలు పాడగా ఆయన వాయిస్ మహేష్ బాబుకు సూట్ కాలేదు. అయితే ఈ సినిమాకు, ఈ సినిమాలో నటించిన నటీనటులకు అవార్డులు దక్కాయి. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఉంటే మాత్రం దర్శకునిగా తేజ రేంజ్ మరింత పెరిగి ఉండేది.