అయోధ్య రామయ్య సినిమాను బాలయ్య రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా?

ప్రతి స్టార్ హీరో తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమా కథలను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేసిన కథలలో కొన్ని కథలలో ఇతర హీరోలు నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్న సందర్భాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్ లో సమరసింహారెడ్డి సినిమా తర్వాత ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని బి.గోపాల్ కు బాలయ్య అభిమానుల నుంచి ఒత్తిడి మొదలైంది.

బి.గోపాల్ కు కథ నచ్చేలా చేయడం సులువు కాదు. ఆ సమయంలో చిన్నికృష్ణ బి.గోపాల్ ను కలిసి కథ చెప్పారు. ఆ కథే నరసింహ నాయుడు కావడం గమనార్హం. హీరోను చిన్నికృష్ణ పోలీస్ ఆఫీసర్ గా చూపించాలని అనుకున్నారు. కానీ బి.గోపాల్ సూచన మేరకు కథలో కీలక మార్పులు చేశారు. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా హీరో పాత్ర ఉండగా ఆ పాత్రను మార్చి డ్యాన్స్ మాస్టర్ గా మార్చారు.

ఈ కథ విని బాలయ్య చిన్నికృష్ణను తెగ మెచ్చుకున్నారు. సౌందర్య ఈ సినిమాలో ఒక పాత్రలో నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మొదట అయోధ్య రామయ్య కథలో నటించాల్సిన బాలయ్య ఆ సినిమా నుంచి తప్పుకుని నరసింహ నాయుడు సినిమాలో నటించారు. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమా అనుకున్న విధంగానే అంచనాలను మించి విజయం సాధించింది.

చివరి నిమిషాల్లో ఈ సినిమా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలను తొలగించారు. బాలయ్య సినిమాకు పోటీగా పలు సినిమాలు రిలీజైనా నరసింహ నాయుడు సినిమా పై చేయి సాధించింది. 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 24 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈతరం ప్రేక్షకులకు సైతం నరసింహనాయుడు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.