Puspha: పుష్ప సినిమాను మహేష్ రిజెక్ట్ చేయడానికి అసలు కారణం అదేనా?

puspha: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న స్పందన బట్టి చూస్తే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాపై ముందు నుంచి భారీగా అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.. అంచనాలకు ఏమాత్రం ఈ సినిమా అందలేదని ప్రేక్షకుల నుంచి స్పందన వినిపిస్తోంది.

అంతేకాకుండా నెటిజన్లు డైరెక్టర్ సుకుమార్ స్థాయి ఇది కాదు అంటూ మాటలతో దెబ్బి పొడుస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ తో రెండవ పార్ట్ పై ఆసక్తి పెంచుకున్నారు. కానీ పుష్ప సినిమా క్లైమాక్స్ లో అలాంటిది ఏమీ కనిపించలేదని అంటున్నారు. ఇకపోతే మొదట సుకుమార్ ఈ సినిమాను మహేష్ బాబుకు వినిపించగా మహేష్ నో చెప్పిన విషయం తెలిసిందే.

మహేష్ బాబుకు ఈ కథ చెప్పగానే క్రియేట్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ లో నటించడం కుదరదని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అప్పట్లో మహేష్ బాబు ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక గల కారణాలు అవే అంటూ పలు రకాల కామెంట్స్ వినిపించినప్పటికీ.. పుష్ప ఆ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు ఆ కథ తనకు అస్సలు సూట్ కాదని.. అది ముందుగానే ఊహించి ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా మహేష్ బాబు చూడడానికి స్టైలిష్ గా ఉండి అమ్మాయిల కలల రాకుమారుడిగా కనిపిస్తాడు.. అలాంటప్పుడు మహేష్ బాబుని ఇలా ఊర మాస్ లో చూపించే ప్రయత్నం ఏ దర్శకుడు చేసినా కూడా ఖచ్చితంగా విఫలం అవుతారు అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రలో మహేష్ బాబుని ఊహించుకోవడమే చాలా దరిద్రంగా ఉంది అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.