హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడూ చర్చలు నడుస్తూనే ఉంటాయి. హీరోయిన్లు ఎవరైనా కోటి మించి డిమాండ్ చేశారు అంటే ఇక వారి మీద విమర్శలే విమర్శలు. కొత్త హీరోయిన్లు అయితే కోటి డిమాండ్ చేశారు అంటే ఆశ్చర్యపోవాలి. కానీ ఎన్నో ఏళ్ల నుండి ఉన్నవారు, స్టార్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకున్నారు కోటి మించి అడిగినా అది సంచలనం అయిపోతోంది. ఇక సమంత లాంటి స్టార్ హీరోయిన్లు, మార్కెట్ ఉన్నవాళ్లు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. వారి మీదా అవే చర్చలు. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది.
కొత్త హీరోయిన్లు, ఒక్క హిట్ పడినవారు కూడ కోటి రూపాయలు అడుగుతున్నారని నిర్మాతలు వాపోయారు. అప్పుడు సమంత తెర మీదకు వచ్చింది. అసలు హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడ పారితోషకం ఇవ్వాలని మొదలుపెట్టిన సమంత ఎవరైనా హీరో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటే ఏమీ అనరు కానీ హీరోయిన్ కాస్త ఎక్కువ అడిగితే అదేదో తప్పు అన్నట్టు ఫీలైపోతారే అంటోంది ఆమె. ఇండస్ట్రీలో టాప్ 3లో ఉన్న హీరోయిన్‌కు కనీసం టాప్ 20కూడా లేని హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువగానే ఇస్తారని, రెమ్యునరేషన్ పెంచితే ఏదో క్రైమ్ అన్నట్టు చూస్తారని హీరోలను మాత్రం ప్రశ్నించరని ఫైర్ అయ్యారు.
ఆరోజు ఆమె అంతలా ఫైర్ అవడానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. ఆమె తన కొత్త చిత్రం ‘శాకుంతలం’కు రెండున్నర కోట్లకు పైగానే పుచ్చుకుంటోంది. ఈమెను అప్రోచ్ అయ్యేటప్పుడు నిర్మాతలు ఇంత అడుగుతుందని ఊహించలేదట. కానీ సమంత ఏకంగా రెండున్నర కోట్లు అడిగేసరికి షాక్ తిన్నా ఒప్పుకున్నారట. ఆ విషయాలో మీడియాకు పొక్కి సమంత అతిగా ఆశపడుతోందని విమర్శలు లేస్తాయేమోనని ముందే చురకలు వేసిందన్నమాట సామ్.