వాటి మూలంగానే ‘పుష్ప’ రెండు ముక్కలైందా ?

Reason behind Pushpa two parts
Reason behind Pushpa two parts
అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’.  సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం.  పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉండనుంది.  మొదట ఒక సినిమాగానే మొదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు రెండు భాగలుగా చేయాలని నిర్ణయించారు. మారిన ప్లాన్స్ మేరకు మొదటి భాగం షూటింగ్ చాలావరకు పూర్తికాగా ఇంకాస్త మాత్రమే బాకీ ఉంది.  ఒక్క షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్.  సికింద్రాబాద్లో షూటింగ్ కూడ మొదలైంది.  సినిమాను రెండు పార్ట్స్ చేయనున్నారు అనగానే ప్రేక్షకుల్లో కొత్త కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అంత పెద్ద సినిమాను చేస్తూ మధ్యలో ఇలా రెండు భాగాలు చేయాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు అంటున్నారు. 
 
నిజానికి ఒకే ఒక్క సినిమాగా ‘పుష్ప’ మొదలైంది. సుకుమార్ మామూలుగానే కథను పెద్దదిగా రాసుకుంటారు.  అనుకున్నదంతా షూట్ చేశాక ఎడిటింగ్ టేబుల్ మీద అవసరం లేనివి కట్ చేస్తుంటారు.  ‘పుష్ప’కు కూడ అదే ఫాలో అయ్యారు.  తీతా చూస్తే భారీగా ఖర్చు పెట్టి తీసిన కంటెంట్ కూడ లేపేయాల్సి వచ్చిందట.  అంత పెట్టి తీసి చివరకి వేస్ట్ అన్నట్టు పక్కన పడేస్తే నష్టం కదా అని ఆలోచించి మిగిలిన ఫుటేజికి ఇంకాస్త కొత్త ఫుటేజ్ కలిపి ఒక పార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చిందట.  నిర్మాతలు సైతం రెండు భాగాలు అయితే లాభాలు కూడ రెండు కదా అని భావించి ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ కేటాయించి రెండవ భాగానికి పూనుకున్నారట. అలా ‘పుష్ప’ రెండు ముక్కలు కాబడిందని ఒక స్టోరీ నడుస్తోంది.