khiladi : ఇప్పుడు దాదాపు పాన్ ఇండియా సినిమా అంతా మన తెలుగు సినిమాల హవానే నడుస్తుంది అని చెప్పాలి. తెలుగుతో పాటు ఓ సినిమా హిందీలో కూడా నిలదొక్కుకుంది అంటే ఆ చిత్రం బంపర్ హిట్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి అలా హిందీ బెల్ట్ కి వెళ్లి గత ఏడాది తన ఫస్ట్ సినిమాతోనే ఐకాన్ స్టార్ “పుష్ప” సినిమాతో ఏకంగా 100 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పాడు.
అయితే దీనికన్నా ముందు హిందీలో అసలు టెస్ట్ ఈ సినిమా ట్రైలర్ తో అని చెప్పాలి. హిందీలో ఒక పాన్ ఇండియా సినిమా వెళ్తుంది అంటే దానికి హిందీ ట్రైలర్ రెస్పాన్స్ ఎంత వచ్చింది ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు అనేది తెలుస్తుంది. అలా అప్పుడుకి పుష్ప చిత్రం 24 గంటల్లో 5.77 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టి ఒక నమ్మకాన్ని అయితే తెచ్చుకోగలిగింది.
ఇక ఇప్పుడు అయితే దీనిని మించిన రెస్పాన్స్ ని అది కూడా తన ఫస్ట్ అటెంప్ట్ లోనే మాస్ మహారాజ రవితేజ అందుకోవడం విశేషం. రమేష్ వర్మ దర్సకత్వంలో తాను నటించిన లేటెస్ట్ సినిమా “ఖిలాడి” ని హిందీలో రిలీస్ అనౌన్స్ చేసి దీని ట్రైలర్ నిన్న రిలీజ్ చెయ్యగా ఆశ్చర్యకరంగా ఈ చిత్రానికి ఏకంగా 6.97 మిలియన్ వ్యూస్ ఒక్క రోజులో వచ్చాయి.
అంటే ఇది పుష్ప కంటే ఎక్కువే అని చెప్పాలి. దీనితో ఖిలాడి పై ఒక్కరిగా మరింత ఆసక్తి నెలకొంది. మరి హిందీ ఆడియెన్స్ ఎలాంటి వెల్కమ్ ని రవితేజకి అందిస్తారో తెలియాలి అంటే ఈ మార్చ్ 11 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటించగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటించారు.