Megastar Film : మెగాస్టార్ సినిమా కోసం  భారీగా డిమాండ్ చేస్తున్న మాస్ మహరాజ్.?

Megastar Film : ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఎందుకో చాలా ఎక్కువగానే మల్టీస్టారర్ లు మొదలయ్యాయి. ఒక హీరోతో మరో హీరో నటించేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో చాలానే సినిమాలు లైన్ లో రిలీజ్ కి ఉండగా వాటి తర్వాత మరికొన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు తెరక్కుతున్నాయి. అయితే మరి వాటిలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నవే కొన్ని ఉన్నాయి.
ఈ సినిమాల్లో దర్శకుడు బాబీ తెరక్కించే చిరు 154వ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా ఉంటాడని ఆల్రెడీ బజ్ ఉంది. అయితే ఇప్పుడు అతడి పాత్ర పై మరింత ఆసక్తికర సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా కోసం గాను రవితేజ బల్క్ గా చాలా డేట్స్ ఇచ్చేసాడు అట. మరి ఈ డేట్స్ కి గాను రవితేజ కూడా పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది.
ఈ సినిమాకి గాను తన రెమ్యునరేషన్ 10 కోట్లు వరకు అడుగుతున్నాడట. దీనితో ఇదే హాట్ టాపిక్ గా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. మరి దీనిపై ఇంకా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రవితేజ చిరు కి తమ్ముడు పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.