రవితేజ ఆర్‌టి టీమ్‌వర్క్స్ – కార్తీక్ రత్నం- సతీష్ వర్మల క్రైమ్ కామెడీ చిత్రం”ఛాంగురే బంగారురాజా” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ ఇటీవల తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌ను ప్రారంభించారు. ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్స్, కొత్త నటీనటులను ప్రోత్సహించడానికి కంటెంట్ ప్రాధాన్యత గల చిత్రాలని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 4గా ‘ఛాంగురే బంగారురాజా’ అనే కొత్త చిత్రం రూపొందుతోంది.

క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం, నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కుషిత కల్లపు కథానాయికగా కనిపించనుంది. సత్య అక్కల, రవిబాబు ఇతర ముఖ్య తారాగణం. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

”ఛాంగురే బంగారురాజా’ టైటిల్ శ్రీ కృష్ణ పాండవీయంలోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు. టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది.

”ఛాంగురే బంగారురాజా’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేయగా, బివిఎస్ రవి, దర్శకుడు సుధీర్ బాబు స్క్రిప్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేషానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.

శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. సుందర్ ఎన్. సి సినిమాటోగ్రాఫర్ గా కృష్ణ కార్తీక్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: కార్తీక్ రత్నం, కుషిత కల్లపు, సత్య అక్కల, రవిబాబు తదితరులు.

బ్యానర్ – ఆర్ టీ టీమ్‌వర్క్స్
నిర్మాత – రవితేజ
రచన, దర్శకత్వం – సతీష్ వర్మ
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు
ప్రొడక్షన్ అసోసియేషన్ – ‘ఫ్రేమ్‌బైఫ్రేమ్ పిక్చర్స్’
డీవోపీ- సుందర్ ఎన్ సి
స్క్రీన్ ప్లే – జనార్దన్ పసుమర్తి
ఎడిటర్ – కృష్ణ కార్తీక్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీనివాస్ నార్ని
సంగీతం – కృష్ణ సౌరభ్
స్టంట్ డైరెక్టర్ – కార్తీక్ కాంతేశ్వర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శ్రీధర్ వర్మ, ఆర్కే నంబు
పీఆర్వో – వంశీ-శేఖర్