Ravi Prakash: సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ టార్గెట్ చేశారని స్పష్టం అవుతుంది ఈయన నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు ముందు నుంచి కూడా అల్లు అర్జున్ గురించి వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఇన్కమ్ టాక్స్ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ పై దాడులు చేస్తూ పెద్ద ఎత్తున ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన లెక్కలు గురించి ప్రశ్నలు వేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రవి ప్రకాష్ అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ అతిశయోక్తితో కూడిన పుష్ప బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఆయనని గ్లోబల్ స్టార్ ను చేస్తాయని అనుకున్నారా? కానీ బదులుగా ఆ సినిమా అతని వ్యక్తిగత దురదృష్టంగా మారినట్లు అనిపిస్తుంది. క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా మొదట తొక్కిసలాట సంఘటన జరిగింది.. ఆ తర్వాత అతను అంతే నిర్లక్ష్యంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకవిధంగా పరిస్థితులను మరింత దిగజార్చాడు
ఇక ఈ సినిమా మరికొన్ని సన్నివేశాలతో తిరిగి విడుదలవుతున్న తరుణంలో బాధితుల శ్రీ తేజ్ ను పరామర్శించి మరింత హైప్ పెంచారు. ఐరనీ ఏంటంటే, ఆ పెంచిన నంబర్స్ ఇప్పుడు ITR రూపంలో అతన్ని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా ‘పుష్ప 3’ మూవీకి “రెక్లెస్ రిటర్న్స్” అని పేరు పెట్టాలి. గ్లోబల్ స్టార్‌డమ్ కోసం వెయిట్ చెయ్యొచ్చు.. కానీ ముందుగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా రవి ప్రకాష్ చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది.
ఇక ఈ పోస్ట్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిన రవి ప్రకాష్ అటెన్షన్ కోసమే ఇలా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ఫెమ్ అవ్వాలని చూస్తున్నారని అందుకే ఈయన పుష్ప 2 సినిమా గురించి గత కొద్ది రోజులుగా నెగిటివ్ గా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అంటూ బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు.
