Ravi Krishna: తల్లిదండ్రులు ఒప్పుకోలేదని రవికృష్ణ కి బ్రేకప్ చెప్పేసిన నవ్య స్వామి..?

Ravi Krishna: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో పలు సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. మొదట కన్నడలో పలు సీరియల్స్ చేసిన తర్వాత, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో పలు సీరియల్స్ లో నటించి అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఆమె కథ సీరియల్ లో నటుడు రవి కృష్ణ తో కలిసి నటించిన తర్వాత వారి మధ్య లవ్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

వారిద్దరు కూడా పలు షోలలో కలిసి పాల్గొనడం, డాన్సులు చేయడం చూస్తుంటే నిజంగానే వారి మధ్య ఏదో ఉంది అని అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు అనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండటంతో ఆ అనుమానాలు మరింత పెరిగాయి. ఇకపోతే ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షోకి హాజరయ్యారు. వీటితో పాటుగా సిద్ధార్థ్, విష్ణు ప్రియా జోడీలు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ సుమ వారితో కాస్త డిఫరెంట్ గా రొమాంటిక్ టాస్క్ లు చేయించింది.

ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ షోలో నవ్య స్వామి తన లవ్ విషయంలో ఓపెన్ అవుతూ రవి కృష్ణ కు బ్రేక్ అప్ చెప్పేసింది. తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటూ రవి కృష్ణ కు బ్రేక్ అప్ చెప్పేసింది నవ్య స్వామి. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 29న ప్రసారం కానుంది.