Rashmika: వ్యక్తిగత జీవితాలకు స్క్రీన్ పై చూసే దానికి సంబంధం ఉండదు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తున్నాయి. దాంతో సినిమా నిర్మాతలకు డైరెక్టర్లకు రష్మిక లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ఈ కాలంలో అందరూ సినిమాల్లోకి రావాలని.. మంచి స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నారు కానీ అప్పట్లో ముఖ్యంగా దక్షిణ భారత కుటుంబాలలో చిత్రపరిశ్రమలోకి రావడం తప్పుగా భావించేవారు. ఎందుకంటే వారికి సినీరంగంపై అవగాహన ఉండేది కాదు. నా కెరీర్‌ ప్రారంభంలో నా కుటుంబం కూడా అంగీకరించలేదు. నాన్న నన్ను మా వ్యాపారంలో చేరాలని అడిగారు.

నిజం చెప్పాలంటే నటనను వృత్తిగా ఎంచుకోవాలని నా ప్రణాళికలో లేదు కానీ.. ఆందోళనలు, సందేహాలన్నీ పక్కకు నెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టాను. మా కుటుంబంలోనే ఈ వృత్తిని ఎంచుకున్న మొదటి వ్యక్తిని నేను. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది యానిమల్‌ సినిమాపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఒక సినిమాను సినిమాలానే చూడాలి. ప్రతి ప్రేక్షకుడు తెరపై చూసిన దాని ద్వారానే ప్రభావితమవుతాడనే విషయాన్ని నమ్మను నేను. ఒకవేళ అలా అవుతారనుకుంటే.. మీకు నచ్చిన సినిమాలు మాత్రమే చూడండి. ప్రేక్షకులకు తాము ఏమి చూడాలనుకుంటున్నారో అనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రతి మనిషిలో మరో కోణం ఉంటుంది. దానినే సందీప్‌ తెరపై ఆవిష్కరించారు. ప్రేక్షకులు దానిని ఎంజాయ్‌ చేశారు. నటీనటులుగా మేము ఆయా పాత్రలను పోషిస్తున్నాం. అంతే కానీ మా వ్యక్తిగత జీవితాలకు స్క్రీన్‌పై మీరు చూసేదానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది హీరోయిన్ రష్మిక మందన..