Ram Charan: టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ఇటీవలే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీతో చివరగా అభిమానులను పలకరించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇంకా చెప్పాలి అంటే మిక్స్డ్ టాక్ వచ్చింది అని చెప్పాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోవడంతో చెర్రీ ఇప్పుడు తన ఆశలన్నీ కూడా తదుపరి సినిమాపై పెట్టుకున్నాడు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పై కూడా నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో విడుదల అయిన రంగస్థలం సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
దానికి తోడు ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా రికార్డుల మోత మోగించడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కాంబో మూవీకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పుష్ప బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించబోతోందట. ఇది సుకుమార్ నిర్ణయమే అని, ఈసారి అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ రష్మిక కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పాలి.. ఈ విషయంపై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..