Rashmika Mandanna: జిమ్ ట్రైనర్ పై పగ తీర్చుకుంటా అంటున్న రష్మిక మందన?

Rashmika Mandanna: అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాలో చెప్పిన విధంగా తగ్గేదే లే అన్నట్టుగా ఈ సినిమాకి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో నటీనటుల నటన ఒక ఎత్తు అయితే, పాటలు మరొక ఎత్తు అని చెప్పవచ్చు.

మరీ ముఖ్యం గా చెప్పాలి అంటే ఇందులో సామీ, శ్రీవల్లి, ఊ అంటావా మావా అనే పాటలు రికార్డులను సృష్టించాయి. ఇప్పటికీ ఈ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలను ఈ క్రియేట్ చేస్తూ ఇప్పటికే చాలామంది పలురకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రష్మిక మందన వేసిన మాస్ ఎప్పుడు ను అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. ఇక ఈ సినిమాలో సామీ సామీ అనే పాటకు హీరోయిన్ రష్మిక మందన ట్రైనర్ కుల్దీప్ సేతి కూడా చెప్పులు వేయడానికి ప్రయత్నించాడు. ఇదే విషయం తెలుసుకున్న హీరోయిన్ రష్మిక మందన తన జిమ్ ట్రైనర్ పై సెటైర్ వేసింది.

మామూలుగా రష్మిక మందన జిమ్ లో వర్కౌట్ లు చేస్తున్నప్పుడు,రష్మిక ను సరిగ్గా చేయమంటూ టార్చర్ పెడుతుంటాడట. ఇక స్వామి పాటకు కుల్దీప్ స్టెప్పులు వేస్తాడని తెలిస్తే.. స్టెప్పులు నేర్పిస్తూ రివేంజ్ తీసుకునేదట రష్మిక మందన.కానీ అలాంటి అవకాశాన్ని మిస్ అయ్యాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సామీ రారా సామీ అనే పాటకు ఇప్పటికే ఎంతోమంది డాన్సులు వేసి ఆ పాటను రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు. ఇంకొంతమంది అయితే సినిమాలో హీరోయిన్ రష్మిక మందన చేసిన విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.