మహేష్, బన్నీ, ఎన్టీఆర్.. ఆ హీరోయిన్ లక్కేమిటో ?

Rashmika Mandanna opposite NTR

Rashmika Mandanna opposite NTR

టాలీవుడ్ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది రష్మిక మందన్న. ఏ హీరోయిన్ కు రాణి అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమెకు మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేయడం టర్నింగ్ పాయింట్ అయింది. ఆ సినిమా విజయంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. పెద్ద హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ఈమె పేరు కూడ ఉంటోంది.

మహేష్ సినిమా తరవాత వేంటనే అల్లు అర్జు, సుకుమార్ కలయికలో ‘పుష్ప’ సినిమాకు సైన్ చేసింది రష్మిక. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమా గణుయాక క్లిక్ అయితే రష్మిక ఫేమ్ డబుల్ అవుతుంది. ఇదలా ఉండగానే ఎన్టీఆర్ సినిమాలో చేసే అవకాశం కూడ దొరికింది ఆమెకు. తారక్ తరవాతి సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కథానాయకిగా రష్మికను అనుకుంటున్నారట. త్రివిక్రమ్ ఆమెకు కథను కూడ నరేట్ చేశారట. కథ విపరీతంగా నచ్చడంతో రష్మిక కూడ ఓకే చెప్పేసిందట. మొత్తానికి లక్ మీద లక్ కలిసొచ్చి రష్మిక సైలెంట్ గా స్టార్ హీరోలందరినీ చుట్టేస్తోంది.