Rashmika Mandanna: అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలో ఎవరు బెస్ట్.. క్రేజీ ఆన్సర్ ఇచ్చిన రష్మిక?

Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రష్మిక నటిస్తున్న సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవుతుండడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు తమిళం హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు రష్మిక నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక అభిమాని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ రష్మికను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నపై రష్మిక స్పందిస్తూ.. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా వండర్‌ తో సమానం. వీరిద్దరూ మన దేశ చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభ గల నటీనటుల్లో నిలుస్తారు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల గురించి నాలాంటి నటిని అభిప్రాయం అడగడం సరికాదు. ఇతరుల ప్రతిభతో సమానమైన వారికే వారి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు, అధికారం ఉంటుంది.

కాబట్టి వాళ్లిద్దరి ట్యాలెంట్‌ పై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు చాలా తెలివిగా క్రేజీగా ఆన్సర్ ఇచ్చింది రష్మిక మందన. ఇకపోతే రష్మిక విజయ్ ల విషయానికి వస్తే.. వీరిద్దరూ కలసి గీతాగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చాలాసార్లు వీరిద్దరూ ఒకే చోట వెకేషన్ కు వెళ్లి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి చాలాసార్లు రష్మికను అటు విజయ్ దేవరకొండను అడగగా తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ విషయంపై రష్మిక విజయ్ లు ఎప్పుడూ స్పందిస్తారో చూడాలి మరి.