Rashmika Mandanna Feeling : వైరల్ : తలపతి తో సినిమాకి రష్మికా ఫీలింగ్ మామూలుగా లేదుగా..!

Rashmika Mandanna Feeling

Rashmika Mandanna Feeling : రీసెంట్ గా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర అనౌన్స్ చేసిన భారీ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా చేయబోయే 66వ సినిమా కూడా ఒకటి. మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తో చేయబోయే మల్టీ లాంగ్వేజ్ సినిమా ఇది. అయితే విజయ్ సినిమా అంటే ఆ అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి.

పైగా ఇప్పుడు విజయ్ ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేస్తుండడంతో తన అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా నుంచి నిన్ననే హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా ని ఫిక్స్ చేసినట్టుగా చిత్ర బృందం అనౌన్స్ చేశారు.

మరి ఈరోజు ఈ బిగ్ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చెయ్యగా ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రష్మికా మందన్నా ఫీలింగ్ మారింది. మొదటి సారి తలపతి తో సినిమా చేస్తుండడంతో ఆ ఎగ్జైట్మెంట్ ని రకరకాలుగా చూపించింది. ఆ స్పాట్ లోనే విజయ్ కి దిష్టి తీసేస్తుంది సిగ్గు పడిపోతుంది..

అయితే ఇదంతా కాస్త ఓవర్ యాక్షన్ లాగే ఉన్నా తన ఎగ్జైట్మెంట్ అంతా బాగా కనిపిస్తుంది. దీనితో ఫోటోలు మంచి వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమాకి తమన్ సంగీతం అందివ్వనుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం చేయనున్నాడు.