ఆ పార్ట్స్ కి చికిత్స కోసం డాక్టర్ ని సంప్రదించిన రష్మిక!

చాలా మంది అనుకున్నట్టు హీరో హీరోయిన్ జీవితాలు అంత సుఖమైనవేమీ కాదు. చాలా విషయాల్లో వాళ్ళు రిస్క్ చేయవలసి వస్తుంది. డాన్స్ లు యాక్షన్ సన్నివేశాలలలో భాగంగా ఒళ్లు నలగ్గొట్టుకోవాలి. అందుకే తరచుగా నటులు గాయాలపాలవుతున్నారు.  ఒక్కోసారి షూటింగ్ లో గాయాలు తీవ్రంగా అవుతాయి. అందం కోసం ఒక్కోసారి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవాలి.

అప్పులతో ‘కూలి’ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కి సీరియస్ ఇంజురీ అయ్యి దాదాపు ప్రాణాల మీదకు వచ్చిందని చాలా వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక మందన్న కూడా ఒక ప్రాబ్లెమ్ తో హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ ఏ వి గురువారెడ్డి కలిసిందని తెలిసింది.

‘పుష్ప’ సినిమాలో శరీర బరువు మొత్తం మోకాళ్లపై ఉంచి సామీ సామీ పాటకు రష్మిక వేసిన స్టెప్ కారణంగా ఆమెకు మోకాళ్ళ నొప్పలు వచ్చాయని, ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చానని డాక్టర్ చెప్పారు. అలాగే త్వరలో అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో నా వద్దకు రావొచ్చని, అభిప్రాయ పడ్డారు.

‘పుష్ప’ సినిమాలో  మేనరిజం కోసం అల్లు అర్జున్ లేని గూని నటించాడు. ఒక భుజాన్ని పైకి ఎత్తుకొని సినిమా మొత్తం కనిపించారు. ఈ కారణంగా అల్లు అర్జున్ కి భుజం నొప్పి రావచ్చని ఆయన అంచనా వేశారు డాక్టర్ ఏ వి గురువారెడ్డి.