బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకుల మీద కూడ గట్టిగానే ప్రభావం చూపింది. ఈ షోకు తెలుగునాట చాలామంది అభిమానులే ఉన్నారు. స్టార్ మా సైతం ఈ షో కోసం భారీగానే ఖర్చు చేస్తుంటుంది. ముఖ్యంగా మోస్ట్ పాపులర్ స్టార్లనే షోకి వ్యాఖ్యతగా తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నాలుగు సీజన్స్ జరిగాయి. వాటికి అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్, నానిలు వ్యాఖ్యతలుగా చేయడం జరిగింది. ఐదవ సీజన్ కూడ నాగార్జున ద్వారానే హోస్ట్ చేయించాలని స్టార్ మా భావించింది. కానీ నాగార్జునకు ఈసారి షోను హోస్ట్ చేయడం కుదరట్లేదట. అందుకే ఆయన నో చెప్పడం జరిగిందట.
దీంతో ఆలోచనలో పడిన నిర్వాహకులు ఈసారి కొత్త వ్యక్తితో వెళదామని డిసైడ్ అయి రానా పేరును పరిశీలిస్తున్నారట. రానాకు హోస్టింగ్ కొత్త కాదు. నెంబర్ వన్ యారీ షోను హోస్ట్ చేశారు రానా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడ చాలా బాగుంటుంది. బుల్లి తెర మీద ఆయనకు చాలామంది అభిమానులే ఉన్నారు. ఆయన హోస్ట్ చేస్తే షోకు బెనిఫిట్ కూడ. అందుకే ఆయన మీద షో నిర్వాహకులు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఈమధ్య కాలంలో బాగా వార్తల్లో, సోషల్ మీడియా చర్చల్లో నలిగిన వారినే ఎంపిక చేస్తున్నారట.