లింగస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ది వారియర్. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. కాగా ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న విషయం మనందరకీ తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలొనే హీరో రామ్ పోతినేని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతుతూ..
దెబ్బలు తగిలేలా స్టెప్పులు వేయడం అవసరమా? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దర్శకులు కూడా అంత కఠినమైన స్టెప్పులు వద్దులేండి అని అంటుంటారు. కానీ అభిమానుల కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. షూటింగ్ జరిగినప్పుడు సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది ప్రేక్షకులు, అభిమానులు కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే నేను వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనిని అయినా వందశాతం చేయడానికి ప్రయత్నిస్తా అని హీరో రామ్ పోతినేని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అంతేకాకుండా ఈ సినిమాలోని విజిల్ అనే పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రాం పోతినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో చిత్ర బంధం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు ట్రైలర్, పోస్టర్ సాంగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా భారీ అంచనాలు పెట్టుకున్నా రామ్ పోతినేని అభిమానులను ఈ సినిమా నిరాశ పరుస్తుందా లేదా అంచనాలకు నుంచి హిట్ అవుతుందా అనేది చూడాలి మరి.