Ram Pothineni : మల్టీ స్టారర్ ఆలోచనల్లో రామ్ పోతినేని.?

Ram Pothineni : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’‌తో మళ్లీ డీలా పడ్డాడు. అర్జెంటుగా రామ్‌కి ఓ మంచి హిట్టు కావాలి. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ మూవీ చేస్తున్నాడు రామ్ పోతినేని. ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

బైలింగ్వల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాతో రామ్ పోతినేని తమిళ తంబీలను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. లింగుస్వామికి తమిళంలో మంచి పేరుంది. అలాగే, ఆయన డైరెక్షన్ స్టైల్ మీదా అంచనాలున్నాయ్. సో, ‘ది వారియర్’పై రామ్ పోతినేని బాగా ఆశలు పెట్టుకున్నాడు.

సరే, అసలు విషయానికి వస్తే, దీంతో పాటు, రామ్ పోతినేని తాజాగా ఓ మల్టీ స్టారర్ మూవీని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్ మల్టీ స్టారర్ కథతో రామ్ వద్దకు వచ్చాడట. కథ బాగా నచ్చిందట రామ్‌కి. రెండు పవర్ ఫుల్ రోల్స్ వున్నాయట కథలో. ఒక పాత్రను రామ్ పోషిస్తుండగా, ఇంకో పవర్ ఫుల్ పాత్ర కోసం స్టార్ హీరో వేటలో పడ్డాడట రామ్ పోతినేని.

గతంలో రామ్ పోతినేని, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ‘మసాలా’ సినిమా వచ్చింది. కానీ, ఆ సినిమా ఆశించిన అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈసారి చేయబోయే మల్టీ స్టారర్ అలా ఇలా వుండకూడదనీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట రామ్ పోతినేని.

ప్యాన్ ఇండియా మూవీ అనలేం కానీ, ఆ స్థాయి విషయం వున్న కంటెంట్ రామ్ పోతినేని చేతికి వచ్చిందట. సో, చాలా జాగ్రత్తగా ఆచి తూచి డీల్ చేయాలనుకుంటున్నాడట. చూడాలి మరి, మల్టీ స్టారర్స్ ట్రెండ్ బాగా నడుస్తున్న ఈ టైమ్‌లో రామ్ పోతినేని నుంచి రాబోయే ఆ పవర్ ఫుల్ కంటెంట్ ఎలా వుండబోతోందో.? ఏ కాంబినేషన్ సెట్ అవ్వబోతోందో.!