Ram Pothineni : తమిళ మార్కెట్‌పై కన్నేసిన రామ్ పోతినేని

Ram Pothineni : ఇంతవరకూ రామ్ హీరోయిజం టాలీవుడ్‌కే పరిమితమైంది. గతంలో రామ్ నటించిన పలు చిత్రాలు హిందీ, తమిళ భాషల్లో డబ్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో ‘ఇస్మార్ట్ శంకర్’ బాగా పాపులర్ అయ్యింది. అంత మాత్రానా రామ్‌కి ఇతర భాషల్లో పెద్దగా క్రేజ్ ఏమీ రాలేదు.
కానీ, తాజాగా రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తమిళ నాట మార్కెట్ సెట్ చేసే పనిలో వున్నాడట రామ్. అందుకు కారణం ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామి. తమిళంలో బాగా క్రేజ్ వున్న దర్శకుడు ఈయన.
ఆటోమెటిగ్గా ఈ సినిమాకి తమిళంలో ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయ్. అలాగే, హీరోయిన్‌గా నటిస్తున్న కృతిశెట్టి కూడా తమిళంలో ఓ సినిమా చేస్తోంది. అటు వైపు నుండీ రామ్‌కి కలిసొచ్చేలా కనిపిస్తోంది. సో ఈ సినిమాతో రామ్ తమిళ మార్కెట్‌ని బాగా ఎట్రాక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ దిశగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట రామ్ పోతినేని.
మరోవైపు ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రామ్, ‘రెడ్’‌తో కాస్త స్లో అయ్యాడు. మళ్లీ ‘ది వారియర్’‌తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. జూలై 14న ‘ది వారియర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.