Ram Gopal Varma : మెగా, అల్లు ఫ్యామిలీ పై వర్మ సంచలన పోస్ట్.. ఎందుకు పెట్టి తీసేసాడో?

Ram Gopal Varma :  వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాడో ఇప్పుడు వాటికి కంప్లీట్ డిఫరెంట్ గా కాంట్రవర్సీ సినిమాలు తప్ప ఇంకోటి తియ్యలేకపోతున్నాడు. కానీ హీరోలు మరియు కొందరు ప్రముఖ వ్యక్తుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సంచలన అంశాలు రేపుతూనే ఉంటాడు..

అయితే గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలను కొందరిని టార్గెట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని సున్నితమైన అంశాలపై కూడా ఊహించని సినిమాలు కూడా తీసి కలకలం రేపాడు వర్మ. అయితే ఆ మధ్య అల్లు ఫ్యామిలీ ని కూడా టార్గెట్ చేసి ఇప్పుడు వారికి ఫేవర్ గా పోస్టులు పెట్టి డిలీట్ చేసేయడం అల్లు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

ఇంతకీ వర్మ పెట్టి డిలీట్ చేసేసిన వాటిలో మ్యాటర్ ఏమిటంటే “మెగా” ఫ్యామిలీ హీరోలు అందరికీ చెప్తున్నాను అల్లు అర్జున్ పాన్ ఇండియన్ లెవెల్ సక్సెస్ ని తెచ్చుకోవడం మీ తరం కాదని అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ ఒంటి చేత్తో మెగా అనే మార్క్ ని అల్లు గా మార్చేసాడని.

ఇంకొన్నాళ్లలో మెగా ఫ్యామిలీ అనేది కాదు అల్లు ఫ్యామిలీ అని స్థాపించబడుతుంది అని సంచలన పోస్ట్ పెట్టాడు. కానీ మళ్ళీ కాసేపటికే ఈ ట్వీట్ లు డిలీట్ చేసేసాడు. కానీ ఈ లోపే నెటిజన్స్ ఈ ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ కొట్టేసి వైరల్ చేస్తున్నారు. దీనితో అసలు వర్మ ఎందుకు ట్వీట్స్ పెట్టి తీసేసాడు అని చర్చ టాలీవుడ్ చర్చగా నడుస్తుంది.