Ram Gopal Varma: స్టార్ హీరో పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వెల్లువ.. వైరల్ అవుతున్న ట్వీట్..!

Ram Gopal Varma:టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియనివారు ఉండరు . ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటారు . ఏ విషయమైన తనదైన పద్ధతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు . ఇండస్ట్రీలో ఆయన అందరిని విమర్శిస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు .ఇండస్ట్రీలో ఆయన ప్రశంసించే వారికంటే విమర్శించే వారే ఎక్కువ .

తాజాగా సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ , ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మధ్య సీట్ల పరంపర కొనసాగుతోంది. సినిమా టికెట్ ధరలు పెంపుపై వర్మ స్పందిస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తున్నారు . ఆయన ట్వీట్స్ కి సమాధానంగా ఏపీ మంత్రి పేర్ని నాని రీట్వీట్ చేశారు . ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ నీ ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ తెగ వైరల్ ఐపోతోంది . అందరిని విమర్శించే వర్మ అల్లు అర్జున్ ని ప్రశంసించాడు అంటే అందరికీ షాకింగ్ గా ఉంది.ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘హే అల్లు అర్జున్, ఆంథిమ్, సత్యమేవ జయతే 2, 83 వంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ..వాటన్నింటిని వెనక్కి నెట్టి పుష్పతో ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకేళ్లావు. ఈ ఘనత నీకే చెందుతుంది. కుదోస్’ అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు .

 

అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచేసింది . ఈ సినిమా ఇప్పటికే తెలుగు ,హిందీ తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో కూడా పుష్ప సినిమా జనవరి 7వ తేదీ నుండి ప్రేక్షకులను అలరించబోతోంది .