ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహా రావు కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ మధ్యే ‘పద్మ’ పురష్కారం తో ప్రభుత్వం సత్కరించింది. కానీ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఈవెంట్ లో జరిగిన సంఘటన గరికపాటికి నిద్రలేకుండా చేసింది.
గరికపాటి తో పాటు ఈ ఈవెంట్ కి చిరంజీవి కూడా వచ్చాడు. చిరంజీవి రావడంతో అక్కడున్న అభిమానులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. దీనితో ప్రవచనం చెబుతున్న గరికపాటికి అసహనం కలిగింది. చిరంజీవిగారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపు రావాలి. లేకుంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతారు. నాకు ఎలాంటి మొహమాటం లేదు. చిరంజీవి ఫోటో షూట్ ఆపేయండి లేదా నాకు సెలవు ఇప్పించండి అంటూ మాట్లాడారు.
గరికపాటి కామెంట్స్ పై నాగబాబు, చోట కే నాయుడు, రామ్ గోపాల్ వర్మ తీవ్రం గా మండిపడ్డారు. నాగ బాబు, చోట సైలెంట్ గా ఉన్నా కానీ రామ్ గోపాల్ వర్మ వదిలేలా లేదు. తాజాగా వర్మ.. గరికపాటి నరసింహారావుపై మరో సెటైరికల్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ లో గరికపాటి గతంలో అనుష్క అందం గురించి కొంటెగా చెబుతున్న వీడియో అప్లోడ్ చేసాడు.
ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. ఒక మంచి స్టిల్ లో అనుష్క ఫోటో పేపర్ లో ఉంది. మా అబ్బాయితో పాటు నేను కూడా చూస్తూ ఉండిపోయా అంటూ గరికపాటి కొంటెగా అనుష్క అందం గురించి ప్రస్తావించారు.
మా అబ్బాయి నా కాళ్లదగ్గర కూర్చున్నాడు. నేను కాళ్ళకి నమస్కరిస్తాడేమో అనుకున్నా. కానీ అనుష్క ఫోటో చూస్తున్నాడు అంటూ గరికపాటి సరదాగా చేసిన వ్యాఖ్యలపై వర్మ సెటైర్లు వేశారు.. ఆహా ఓహో అంటూ వర్మ ట్వీట్ చేయడం విశేషం. గతంలో గరికపాటి చెప్పిన పలు విషయాల్ని వర్మ ట్వీట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.