చిరంజీవి, రజినీకాంత్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా?

ఇప్పుడంటే అర్ధం లేని సినిమాలు తీసి కేవలం కాంట్రవర్సీల మీద నెట్టుకొస్తున్నాడు కానీ రామ్ గోపాల్ వర్మ అంటే 1990 ల లో ఒక పెద్ద బ్రాండ్. అప్పులతో రామ్ గోపాల్ వర్మ అంటే పిచ్చి క్రేజ్ ఉండేది. ‘శివ’ సినిమాతో ఒక ఊపు ఊపిన రామ్ గోపాల్ వర్మ తో సినిమాలు చెయ్యాలని పెద్ద పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు వెనుకపడేవారు.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పారు. రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమా చూసి థ్రిల్ ఐన తను వర్మ కి కొంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చాడు.

అయితే రామ్ గోపాల్ వర్మ రెండు కథలు అశ్వినీదత్ కి చెప్పాడు. అందులో ఒకటి ‘గోవిందా గోవిడ’, రెండోది ‘రంగీలా’. అయితే ‘రంగీలా’ లో శ్రీదేవి తో పాటు చిరంజీవి, రజినీకాంత్ లను హీరోలుగా పెడదాం అనుకున్నారంట. అయితే అశ్వినీదత్ కి మాత్రం ‘గోవిందా గోవిందా’ స్టోరీ బాగా నచ్చడం తో ఆ సినిమా తీశారు. కానీ, ఆ సినిమా భారీ ప్లాప్ అయ్యింది.

‘గోవిందా గోవిందా’ ప్లాప్ అయ్యాక రామ్ గోపాల్ వర్మ తనకు సెన్సార్ బోర్డు తో గొడవలు ఉన్నాయని ఇక ఎప్పటికి తెలుగు లో సినిమాలు తియ్యని అని డిసైడ్ అయ్యి ముంబై వెళ్ళిపోయాడు.

బాలీవుడ్ లో తన మొదటి సినిమా ‘రంగీలా’ తో సత్తా చాటుకున్నాడు. అయితే ఇందులో శ్రీదేవి, చిరంజీవి, రజినీకాంత్ బదులు ఊర్మిళ, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ లను తీసుకున్నాడు. ఒక వేల నిజానికి చిరు, ర‌జ‌నీ, శ్రీ‌దేవిల‌తో రంగీలా తీసుంటే ఏమైపోయేదో మ‌రి..?!