Ram Gopal Varma : వైరల్ : కొడాలి నానికి వర్మ మాస్ రిప్లై చూస్తే దిమ్మతిరుగుద్ది గురూ!

Ram Gopal Varma : ప్రస్తుతం మళ్ళీ టాలీవుడ్ లో నడుస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సంచలనాలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యిన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్నటి నుంచి టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని దాని తర్వాత ఇంకొకటి నాన్ స్టాప్ గా ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ఇక వాటికి బదులుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కి వర్మకి ఈరోజు ఉదయం అంతా కూడా ట్విట్టర్ లో ఇదే వార్ నడిచింది. ఇక ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వానికి చెందిన మరో నాని అయినటువంటి మంత్రి కొడాలి నాని విషయంలో వర్మ ఊహించని ట్వీట్ వెయ్యడం ఒక్కొక్కరికి షాకిచ్చింది. అప్పుడు కొడాలి నాని టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని అంటే ఎవరో నాకు తెలీదని చెప్పిన స్టైల్ లోనే..

“ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.” అని నాని అకౌంట్ ని ట్యాగ్ చేసి సమాధానం ఇచ్చాడు. దీనితో ఈ ఇష్యూ ని సపోర్ట్ చేస్తున్న మూవీ లవర్స్ లో ఈ రిప్లై ఓ రేంజ్ లో భారీ రెస్పాన్స్ తో వైరల్ అవుతుంది.