Ram Gopal Varma : మామూలుగా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో మన ఇండియా లోనే తోప్ డైరెక్టర్ గా రాజమౌళి ది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమాని వేరే లెవెల్లో ప్రమోట్ చేసుకుంటూ టోటల్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ ని తాను తెచ్చుకుంటాడు.
అయితే ఇలా తన సినిమాని ఒక స్టాండర్డ్ లో సినిమాని ప్రమోట్ చేసుకుని ఇప్పుడు అదరగొడుతుంది. అయితే ఇంతలా ఫేమస్ అయ్యిన సినిమాతో తన సినిమాని కూడా కలిపేసి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సింపుల్ ట్రిక్స్ తో ప్రమోట్ చేసేసుకుంటున్నాడు.
రాజమౌళి RRR ముగ్గురు కీలక వ్యక్తులు రాజమౌళి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మీ ముగ్గురు కాంబో డేంజరస్ అయితే అయితే మేము కూడా ముగ్గురం ఉన్నాం అని తాను తన సినిమా “డేంజరస్” యంగ్ అండ్ హాట్ హీరోయిన్స్ నైనా గంగూలీ మరియు అప్సర రాణి లతో కలిపి రెండు ఫోటోలు కలిపేసి ఫ్రీ ప్రమోషన్స్ ని RRR లెవెల్లో చేసేస్తున్నాడు.
దీనితో రాజమౌళి లాంటి దర్శకుడికే మించి ప్రమోషన్స్ ని తాను చేసినట్టు అయ్యింది. అయితే వర్మ ఆ సినిమాని ఇండియా లోనే ఫస్ట్ లెస్బియన్ అడల్ట్ డ్రామాగా తెరకెక్కించాడు. దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ఇలా ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దీనితో ఈ పోస్ట్ మంచి వైరల్ అవ్వసాగింది.
https://twitter.com/RGVzoomin/status/1509214050869444611?s=20&t=zCJHvEKtj-X2f6bfi7k3pg