RRR  సినిమాను సర్కస్ తో పోల్చిన రామ్ గోపాల్ వర్మ

గత చాలా కాలంగా తన సినిమాలు తో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్న రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక కాంట్రవర్సీ తో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక బాంబ్ పేల్చాడు. రాజమౌళి RRR సినిమాను సర్కస్ తో పోల్చిన ఆయన .. సినిమాల గురించి రకరకాల అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడంటే..?

ఈ సినిమా తనకు ఒక సర్కలా అనిపించిందని  సంచలన వ్యాఖ్యలు చేసారు రామ్ గోపాల్ వర్మ.  సర్కస్ చూస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో… ఈ సినిమా చూసినా అదే ఫీలింగ్ కలిగిందన్నారు.

ముఖ్యంగా బ్రిడ్జి దగ్గర ఒక కుర్రాడిని క కాపాడే సీన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా జెమినీ సర్కస్ చేస్తున్న ఫీలింగ్ తనకు కలిగిందని అన్నారు ఆర్జీవి. అనేవన్నీ అంటూనే.. తాను మాట్లాడిన మాటలు తప్పుగా ర్ధం చేసుకోవద్దని కూడా వర్మ కోరడం విచిత్రం.  తన అభిప్రాయం ప్రకారం… RRR ఆర్ ను నేను విమర్షించడంలేదు..  సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి జోష్ కలుగుతుందో అలాంటిదే ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిందని  అన్నాను అంతే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు వర్మ.

అలాగే మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని స్పష్టం చేశారు. ఒకసారి తామిద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నామని… ఆయన తన మాట వినలేదని, తాను ఆయన మాట వినలేదని చెప్పారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2 ‘ సినిమా పై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని కూడా రాము అన్నారు. ఇటీవలే రిలీజ్ ఐన రామ్ గోపాల్ వర్మ సినిమాలు ‘కొండా’, ‘లడ్కి’ సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి.