Ram Gopal Varma : ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర తమ సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు తెలుస్తున్న దర్శకుల జాబితాలో మన సౌత్ నుంచి అయితే వెరీ యంగ్ అతి తక్కువ ఎక్స్ పీరియన్స్ కలిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయాడు. కేవలం మూడే మూడు సినిమాలతో భారీ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
లేటెస్ట్ గా తన భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” తో 1000 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరిన ఈ దర్శకుడిపై దేశ వ్యాప్తంగా కూడా ప్రశంసలు వచ్చాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ దర్శకునిపై సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలోనే క్రేజీ ట్వీట్ పెట్టడం ఆసక్తిగా మారింది.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా దగ్గర అన్ని భాషల్లో హిందీ, తమిళ్, తెలుగు మలయాళం అలాగే తన కన్నడ ఇండస్ట్రీలలో కూడా ఏ దర్శకునికి నిద్ర పట్టనివ్వడం లేదని ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా దగ్గర వీరప్పన్ లా మారాడని సంచలన బిరుదు అందించాడు.
దీనితో ఈ సెన్సేషనల్ ట్వీట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఓ పక్కన తన ఇండియాస్ ఫస్ట్ లిస్బియన్ అడల్ట్ డ్రామా రిలీజ్ పనుల్లో ఉన్నాడు దానితో ఇలాంటి ట్వీట్స్ తో మరోపక్క అటెన్షన్ ని కూడా తెచ్చుకుంటున్నాడు.
I wish a very UNHAPPY Directors day to @prashanth_neel for so royally FUCKKKKING every directors mind everywhere whether it’s in BOLLYWOOD, TOLLYWOOD,KOLLYWOOD and even in SANDALWOOD ..Sir Prashant Neel, U are the VEERAPPAN of indian cinema🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022