యువతకు గీతోపదేశంలా వర్మ వెబ్ సిరీస్ ?

ram gopal varma announced a new web series

వివాదాలతో సహజీవనం చేయటానికి ఇష్టపడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సమాజానికి ఉద్ధరించే పని పెట్టుకున్నారు. పెళ్లి తర్వాత భార్యలు ఎలా ఉంటారో ముందుగానే మగవారు తెలుసుకునేలా చేయటానికి ఆయన ‘రకరకాల భార్యలు’ పేరుతో వెబ్ సిరీస్ చేసేందుకు పూనుకున్నారు. దీని తర్వాత ఆడవాళ్ళు భర్తలు గురించి తెలుసుకునేందుకు వీలుగా ‘రకరకాల భర్తలు’ పేరుతో మరో వెబ్ సిరీస్ చేస్తారట. ట్విట్టర్ లో ఈ విషయాన్నీ వెల్లడిస్తూ తన ప్రాజెక్ట్ గురించి ఒక ఆడియో బైట్ ని అందించారు.

ram gopal varma announced a new web series
 

మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉండే ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకమైన భార్య గురించి బయటపెడతారట. ఏడుపుగొట్టు భార్య, ఎప్పుడూ దెబ్బలాడే భార్య , ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి , ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు భార్య, ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే భార్య ఇలా ఎనిమిది రకాల స్వభావాల మీద ఉండబోతుందని వివరించారు. ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య నటించబోతున్నట్లుగా అర్ధమవుతుంది. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ వర్మ ఎలాంటి పైత్యం చూపెడతాడో చూడాలి.