ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించనున్న రామ్ చరణ్..?

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి అద్భుతమైన తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకున్నాడు. కానీ తాజాగా తన తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమా మాత్రం నిరాశ పరిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని రామ్ చరణ్ కి జోడీగా నటించనుంది. ఇప్పటికే వీరు ” వినయ విధేయ రామా ” సినిమాలో కలిసి నటించారు. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి .

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ గురించి ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడిగా పూజా హెగ్డే నటించనుంది. ఈ సినిమాలో ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల రామ్ చరణ్ గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.