Klin Kaara: చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్…RC16 లో క్లిన్ కారా…..ఖుషి అవుతున్న ఫాన్స్?

Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఇలా ఎంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. నటనపరంగా ప్రేక్షకులను మెప్పించిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చరణ్ మాత్రం తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

రామ్ చరణ్ తన 16 వ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ శివారులలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి రాంచరణ్ తన కుమార్తె క్లిన్ కారాను తీసుకువెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.

ఇలా క్లీన్ కారా రామ్ చరణ్ సినిమా షూటింగ్ లొకేషన్లో కనిపించడంతో సరదాగా రామ్ చరణ్ తనని షూటింగ్ సెట్లోకి తీసుకువెళ్లారా లేకపోతే క్లీన్ కార కూడా ఈ సినిమాలో ఏదైనా చిన్న పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాలో కనుక క్లీన్ కారా నటించినట్లయితే మెగా అభిమానులకు ఇంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదని చెప్పాలి. అయితే ఇప్పటివరకు క్లీన్ కార ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం మెగా ఫ్యామిలీ బయట పెట్టలేదు అయితే తనని నాన్న అని పిలిచినప్పుడు మాత్రమే తన కూతురి ఫోటో రివీల్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.