Home News ఎన్టీఆర్ హాట్ సీట్లో రామ్ చరణ్ !

ఎన్టీఆర్ హాట్ సీట్లో రామ్ చరణ్ !

Ram Charan To Attend Ntr'S Show
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు టీవీ షోలకు కూడ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.  ఇప్పటికే రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించి  బుల్లి తెర మీద కూడ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరొక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు.  అదే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’.  ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.  ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో ఇప్పటికే షోకు బోలెడంత క్రేజ్ వచ్చేసింది.  దీన్ని డబుల్ చేయడానికి ప్లాన్ చేశారు టీమ్. 
 
ఈ షో మొదటి ఎపిసోడ్లో అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతాడట.  ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా మీద బోలెడంత క్రేజ్ ఉంది. దీన్ని వాడుకుని షోకు మంచి రీస్టార్ట్ ఇవ్వాలనేది ఛానల్ ఆలోచన.  ఇలా ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు కలిసి ఇక్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి.  రామ్ చరణ్ హాజరు దాదాపు ఖాయమనే అంటున్నారు.  త్వరలోనే ఈ విషయమై ఒక అధికారిక కన్ఫర్మేషన్ వచ్చే వీలుంది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.  

Related Posts

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News