Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా రామ్ చరణ్ స్టార్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా రామ్ చరణ్ మే 10వ తేదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ దంపతులు చిరంజీవి సురేఖ తన కొడుకు మైనపు విగ్రహంతో కలిసి ఫోటోలు దిగారు. అలాగే ఉపాసన సైతం ఈ విగ్రహంతో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఈయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటికే మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా ఏర్పాటు చేశారు మరి విగ్రహంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే… మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విగ్రహం కేవలం రామ్ చరణ్ ది మాత్రమే కాకుండా తన పెట్ రైమ్ ది కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇలాగా కేవలం ఎలిజిబెత్ క్వీన్ విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరించారు.
ఎలిజిబెత్ క్వీన్ తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మేడం టుస్సాడ్స్ ఈమె తర్వాత రామ్ చరణ్ తన పెంపుడు కుక్కతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో ఎలిజిబెత్ తర్వత అంతటి గౌరవాన్ని అందుకున్న నటుడిగా రామ్ చరణ్ సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే ప్రస్తుతం లండన్ లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటికీ త్వరలోనే ఈ విగ్రహాన్ని తిరిగి సింగపూర్ మ్యూజియంకి తరలించనున్నారు.