Ram Charan : వైరల్ : ఆసక్తికరంగా చరణ్ కొత్త లుక్..శంకర్ ఏదో గట్టి ప్లానే వేసినట్టున్నాడు!

Ram Charan : మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో చేసిన భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ కి రెడీగా ఉండగా దీని తర్వాత ఎలాంటి సినిమా అనౌన్స్ చేస్తాడా అనుకుంటే ఇంకో ఇండియా టాప్ దర్శకుడు శంకర్ తో సెన్సేషనల్ సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా పాన్ ఇండియా మార్కెట్ లో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇక శంకర్ సినిమాలు అంటే ఆ రేంజ్ ఇంకోలా ఉంటుంది. హీరో పాత్ర నుంచి సినిమాలో సెట్టింగ్స్ వరకు ఆ స్థాయే వేరే లెవెల్లో కనిపిస్తుంది. ఇప్పుడు అందుకు ఏమాత్రం తీసిపోకుండా శంకర్ ఈ సినిమాని ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిపోయిన అంశం ఏమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ మేకోవర్ కోసం అని చెప్పాలి.

ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడని టాక్ ఉండగా ఇప్పుడు బహుశా ఇది నిజమే అనిపిస్తుంది. ఆల్రెడీ షెడ్యూల్స్ లో ఒక లుక్ తో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఇంకో కొత్త లుక్ లో కనిపించి సోషల్ మీడియాని షేక్ చేసి పారేసాడు. ఇప్పుడు ఈ ఫోటోలే ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

దీనితో శంకర్ రామ్ చరణ్ తో ఏడో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. మరి శంకర్ రామ్ చరణ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.