Allu Arjun -Ram Charan: అల్లు అర్జున్ లో ఆ క్వాలిటీ అంటే చరణ్ కు అంత ఇష్టమా… బెస్ట్ అంటున్న చరణ్!

Allu Arjun -Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ వరుసకు బావ బావమరుదులు అవుతారు. ఇక వీరిద్దరు కూడా చిన్నప్పటినుంచి ఓకే కుటుంబంలో పుట్టి పెరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో రాంచరణ్ అల్లు అర్జున్ మధ్య బేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు ఫాలో చేసుకోవడం మానేశారు. అదే విధంగా పుట్టినరోజులు సందర్భంగా ఒకరినొకరు విష్ చేసుకోవడం కూడా మానేశారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా సమయంలో అరెస్టయి జైలుకు వెళ్ళగా ఎంతోమంది హీరోలందరూ అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించారు కానీ రామ్ చరణ్ మాత్రం ఎక్కడ అల్లు అర్జున్ ను పరామర్శించిన దాఖలాలు కూడా కనిపించలేదు.

ఇలా ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందనే తెలుస్తుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈయన అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటి జయప్రద హోస్ట్ గా వ్యవహరించినటువంటి ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జయప్రద రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చరణ్ సమాధానం చెబుతూ… నాకు బన్నీలో బాగా నచ్చింది తన నిజాయితీ. తన మనసులో ఏది పెట్టుకోరు ఏది ఉన్న బయటికి వెంటనే మాట్లాడేస్తారు. ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు తప్ప దానిని అలాగే క్యారీ చేయరు. ఈ విషయం నాకు బన్నీలో చాలా బాగా నచ్చుతుంది అంటూ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.