Peddi Movie: టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అలాగే ఇప్పటికే ఈ మూవీ విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ తెగ ఆకట్టుకున్నాయి.
అలాగే ఇటీవల విడుదలైన రామ్ చరణ్ స్పెషల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ తిరిగి మళ్ళీ మొదలు పెట్టారు. వినాయక చవితి సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. పెద్ది సినిమాలోని ఒక మాసివ్ సాంగ్ షూటింగ్ ను మైసూర్ లో ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
https://twitter.com/BuchiBabuSana/status/1960656939941290152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1960656939941290152%7Ctwgr%5E26ab8f11782d3df9d65502a8edb6273d0e75d506%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fram-charan-peddi-movie-mass-song-shoot-update-in-mysore-with-1000-dancers-1614212.html
జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ పై ఈ పాటను చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాదాపుగా 1000 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటను షూట్ చేశారని విజువల్ ట్రీట్ అందించనున్నట్లు తెలిపారు. ఈ పాటలో చెర్రీ అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారట. అంతేకాకుండా ఈ పాటతో థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అని తెలుస్తోంది.
