Ram Charan -Ntr: ఎన్టీఆర్ పై ముద్దుల వర్షం కురిపించిన చరణ్… నాటు నాటు పాటకు చిరు బాలయ్య స్టెప్పులు.. తారక్ రియాక్షన్ ఇదే!

Ram Charan -Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా సక్సెస్ అందుకున్న రాంచరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఇటీవల RRR సినిమాలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగాను గ్లోబల్ స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు..

తాజాగా మరోసారి ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. లండన్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ఎన్టీఆర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై కీరవాణి తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఈ వేదికపై మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో స్టేజ్ పైనే రామ్ చరణ్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా వారందరితో కూడా శుభాకాంక్షలు చెప్పించారు అనంతరం ఎన్టీఆర్ ను హగ్ చేసుకుని తనకు ముద్దులు పెడుతూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. ఇక ఈ వేదికపై ఎన్టీఆర్ నాటు నాటు పాట గురించి పలు విషయాలను తెలిపారు.

ఈ పాట గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ….. ఈ పాటలో తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతి అని తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత అద్భుతమైన డాన్సరో మనకు తెలిసిందే అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా అద్భుతమైన డాన్సర్ వీరిద్దరూ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేస్తే అది ఈ చరిత్రలోనే ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.