Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు .400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోడ నటించారు . తాజాగా రామ్ చరణ్ “రౌడీ బాయ్స్”సినిమా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యారు.హర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు మేనల్లుడు ‘ఆశిష్ రెడ్డి’ హీరోగా రౌడీ బాయ్స్ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నాడు . ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ఈనెల 14వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం మ్యూజికల్ నైట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాస్ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారిన అనిల్ రావిపూడి తను దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని మంచి విజయం సాధించాయి . తాజాగా F2 సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఒక మంచి బంగారం. రామ్ చరణ్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. దానికి టాలీవుడ్ హీరోలందరూ మంచి హీరోలే. ఏ కష్టం వచ్చినా అందరూ ముందుంటారు. రాజమౌళి గారి అబ్బాయి పెళ్లి లో ఫస్ట్ టైం తాను రామ్ చరణ్ ని కలిసాడని.. అనిల్ అని పరిచయం చేసుకుంటే F2డైరెక్టర్ కదా అని అన్నారు. రామ్ చరణ్ వెంటనే నా సినిమాకి పోటీనా? అని అనగానే తనకు చెమటలు పట్టాయని అనిల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
రామ్ చరణ్ ఇలా ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం అనిల్ రావిపూడి కి ఎంతగానో నచ్చిందట. రౌడీ బాయ్స్ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో అనిల్ రామ్ చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే రౌడీ బాయ్స్ సినిమా ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించబోతున్న తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి కి ఈ సినిమా మంచి గుర్తిపు తెచ్చిపెడుతుందని , ముఖ్యంగా ఈ సినిమా యువతకు బాగా నచ్చుతుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తంచేశారు.