Game Changer Trailer: చెర్రీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజ‌ర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Game Changer Trailer: తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ విడుదల కావడానికి మరికొన్ని రోజులు సమయం ఉంది. దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గేమ్ చేంజర్ సినిమా మేనియానే కనిపిస్తోంది. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ ఆ అంచనాలు కాస్త భారీగా పెంచేస్తున్నారు మూవీ మేకర్స్. కాగా రోజు రోజుకీ ఈ సినిమాపై ఉన్న ఎక్సపెక్టేషన్స్ ని భారీగా పెంచేస్తున్నారు దిల్ రాజు.

జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. కాగా ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ ల‌కు మంచి స్పంద‌న రాగా అవి సినిమా పై అంచ‌నాల‌ను పెంచాయి. ఇక ఈ చిత్ర ట్రైల‌ర్ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర బృందం సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 2న సాయంత్రం 5 గంట‌ల 4 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

 

ఆట మొద‌లైంది అంటూ చ‌ర‌ణ్ పంచె క‌ట్టుతో ఉన్న ఫోటోను పంచుకుంది. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. అయితే అభిమానులు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు విడుదల తేదీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా మూవీ టీమ్ గుడ్ న్యూస్ ని తెలిపింది.