విజయ్ దేవరకొండ పై గుర్రు గా ఉన్న రామ్ చరణ్ ఫాన్స్

Vijay Deverakonda

దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ లాగ నటుల్లో విజయ్ దేవరకొండ కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో ఇరుక్కుంటూ ఉంటాడు. LIGER సినిమా ప్రమోషన్స్ లో ‘అయ్యా తాత తెల్వద్’ అని స్టార్ హీరోలని ఉద్దేశించి అన్నాడు. ఆ తర్వాత మూవీ ప్రమోషన్ సమయంలో విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్న తీరును చాలా మంది తప్పుబడుతూ విమర్శలు చేస్తూ ఉన్నారు.సోషల్‌ మీడియాలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కుర్చీ మీద కాళు పెట్టి మరీ జర్నలిస్ట్‌ తో మాట్లాడటం పై విమర్శలు వస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా విజయ్ దేవరకొండ పై చాలా కోపంగా ఉన్నారు. రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో RRR సినిమా కి ఆస్కార్ వస్తుందని అంటున్నారు మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించారు.

దీనికి విజయ్ స్పందిస్తూ ఎన్టీఆర్ అన్న మరియు చరణ్ అన్న లు చాలా కష్టపడ్డారు.వారికి ఆస్కార్‌ అవార్డ్‌ రావడం అనేది గొప్ప విషయం అవుతుంది అంటూ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు.ఆయనకు అయిదు ఆరు భాష లు వస్తాయి.

ఆయన గొప్ప నటుడు.ఆయన వంటి నటుడు ఆస్కార్‌ ని దక్కించుకుంటే తెలుగు సినిమా గర్వించడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించి రామ్ చరణ్ ను తక్కువ చేసి మాట్లాడాడు అంటూ విజయ్ దేవరకొండ పై మెగా ఫ్యాన్స్ కోపం తో ఉన్నారు. విజయ్ నటించిన LIGER సినిమా ఈ నెల 25 న రిలీజ్ కు సిద్ధంగా వుంది.