Ram Charan: సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును సృష్టించిన.. మెగా పవర్ స్టార్!

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న నటుడు రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎలాంటి కుటుంబ సహాయ సహకారాలు లేకుండా తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న వారిలో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉండగా తాజాగా రామ్ చరణ్ తేజ్ కూడా చేరిపోయాడు.

సోషల్ మీడియా ఖాతా ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రామ్ చరణ్ ఏకంగా 5 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని సరికొత్త రికార్డును సృష్టించారు.ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొంతమంది హీరోల జాబితాలో చేరిపోయారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ఈ నెల 7వ తేదిన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అదే విధంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.