పదవ పెళ్లిరోజు వేడుకలను ఆ నగరంలో ఘనంగా ప్లాన్ చేసిన రామ్ చరణ్ దంపతులు?

మెగా వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ కాస్త తన సినిమా షూటింగులకు విరామం ప్రకటించి తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు ఎయిర్ పోర్టులో ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ జంట త్వరలోనే వీరి పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీధి పదవ పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడం కోసం ఈ జంట ఇటలీ వెళ్లినట్లు తెలుస్తోంది.

10 సంవత్సరాల క్రితం రామ్ చరణ్ జూన్ 14వ తేదీ ఉపాసన మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఇక వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు కావడంతో ఈ ప్రత్యేకమైన రోజును పెద్ద ఎత్తున జరుపుకోవడం కోసం ప్లాన్ చేశారు. అందుకే ఈ పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇటలీలోని ప్రఖ్యాత నగరమైన మిలాన్ నగరంలో ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ఇప్పటికే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక 10 సంవత్సరాలనుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా గడుపుతో ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.

రామ్ చరణ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకోగా, ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్తగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న ఈ జంట వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే పది సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇప్పటివరకు పిల్లల గురించి ఆలోచించకపోవడంతో మెగా అభిమానులు ఈ విషయంలో కాస్త నిరాశ పడుతున్నట్లు తెలుస్తోంది.